వినాయక నిమజ్జనం.. ట్రాఫిక్ డైవర్షన్స్

TG: వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుంచి 26న ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని CP తెలిపారు. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు శోభాయాత్ర మార్గంలో స్పెషల్ రూల్స్ ఉంటాయి. NTR మార్గ్, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై రాకపోకలకు ఆంక్షలు విధించారు. వాహనదారులు ఇన్నర్ రింగ్ రోడ్, ORRను వినియోగించాలని పోలీసులు సూచించారు. ఎయిర్‌పోర్ట్ ప్రయాణికులు PVNR ఎక్స్‌ప్రెస్‌వే లేదా ORR వైపు వెళ్లాలని తెలిపారు.


