← Back to news

దొంగిలించిన చీరే దొంగలను పట్టించింది

By dk· 15 Aug 2026· రంగారెడ్డి జిల్లా
దొంగిలించిన చీరే దొంగలను పట్టించింది

TG: రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్‌లోని వినాయకనగర్‌లో యాదయ్య ఇంట్లో 2023లో రూ.2.50 లక్షల నగదు, 9తులాల బంగారం, చీరలు చోరీ అయ్యాయి. కేసు నమోదైనా నిందితు ఆచూకీ లభించలేదు. ఇటీవల యాదయ్య భార్య ఓ ఫంక్షన్‌కు వెళ్లగా, ఇంటి వెనుక నివసించే స్వప్న అనే మహిళ కట్టుకున్న చీరను గుర్తించారు. అది తన ఇంట్లో చోరీకి గురైన చీరగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్వప్న, ఆమె భర్త రాములును అదుపులోకి తీసుకుని విచారిస్తే, మూడేళ్ల క్రితం మేమే దొంగతనం చేశాం అని ఒప్పుకున్నారు. ఆ దంపతుల్ని అరెస్ట్ చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 5h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.