← Back to news

స్కూళ్లలో వసతులు కల్పించాలి: ఆకునూరి

By Vishnu· 1h ago
స్కూళ్లలో వసతులు కల్పించాలి: ఆకునూరి

TG: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం ICUలో ఉందని, దానికి వెంటనే చికిత్స చేయాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు. సర్కారు బడుల పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద 12 రోజుల రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర ప్రారంభమైంది. రాష్ట్రంలో 80-85 శాతం పిల్లలు ప్రైవేట్‌ బాట పట్టారని, ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. విద్యారంగానికి రాష్ట్ర GDPలో 18 శాతం నిధులు కేటాయించాలని, మోడల్ స్కూళ్లు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

More in TG