← Back to news

బాన్సువాడ బాలింతలను నిమ్స్‌లో పరామర్శించిన హరీశ్ రావు

By Balakrishna· 20 Jul 2026

TG: బాన్సువాడ మాతా శిశు హాస్పిటల్లో బాలింతలకు చేసిన ఆపరేషన్ ఫెయిలవ్వడంతో తీవ్ర అస్వస్థతకు గురై ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు సోమవారం నిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి బాలింతలను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు.

More in News