మెడికో, యువకుడు అనుమానాస్పద మృతి

TG: నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం మునుకుంట్ల గ్రామంలో ఓ వైద్య విద్యార్థిని, ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBS మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. అదే గ్రామానికి చెందిన చరణ్ అనే యువకుడు గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకుని మృతిచెందాడు. కాలేజ్ హాస్టల్ నుంచి యువతి ఇంటికి వెళ్లిన అనంతరమే ఈ రెండు ఘటనలు జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమ వేధింపులా లేదా ఇతర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



