← Back to news

ములుగులో ఘోర విషాదం

By Bala· 3h ago· TG
ములుగులో ఘోర విషాదం

TG: ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరులో విషాదం చోటుచేసుకుంది. పొలాల్లో డ్రిప్ పేపర్ పరుస్తున్న క్రమంలో కరెంట్ షాక్తో సమ్మయ్య, అభిషేక్ మృతి చెందారు. ఈ ఘటనలో నరేశ్కి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన నరేశ్ను చికిత్స నిమిత్తం ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More in TG

కులాంతర పెళ్లి చేసుకుందని ఇల్లు కూల్చివేత.. పోలీసులు?
TG· 5h ago

కులాంతర పెళ్లి చేసుకుందని ఇల్లు కూల్చివేత.. పోలీసులు?

TG: గద్వాల జిల్లాలో దారుణ ఘటన జరిగింది. రేపల్లి గ్రామానికి చెందిన మహేశ్వరి, రంగముని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తాను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని, తల్లిదండ్రులతో వెళ్లేది లేదని మహేశ్వరి పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే కులాంతర వివాహంపై కోపంతో యువతి కుటుంబ సభ్యులు ట్రాక్టర్లు, గడ్డపారలతో రంగముని ఇంటిని కూల్చేశారు. <a href="https://www.theclearcutnews.com/n/s7Lc8Cr">బాధితుల ఫిర్యాదుతో</a> పోలీసులు గ్రామంలో సెక్యూరిటీ పెట్టారు. ఘటన తర్వాత ఆ ముగ్గురు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది.