ఆయుధాల చోరీ ఎలా చేశారు? అక్కడే.!

హైదరాబాద్‌లోని బొల్లారం మిలిటరీ కంపౌండ్ నుంచి ఆయుధాలు చోరీ అయిన కేసులో పోలీసులు ఓ మాజీ ఆర్మీ అధికారిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన గతంలో మద్రాస్ రెజిమెంట్‌లో పనిచేశారు. చెడు వ్యసనాల కారణంగా ఈ చోరీ చేశారని తెలిసింది. మరో ముగ్గురు అధికారులు సహకరించినట్లు గుర్తించి వారిని కూడా అరెస్టు చేశారు. నిందితుడి ఇంట్లో 12 AK-47 తుపాకులు, ఇన్‌సాస్ గన్స్‌తో పాటు దాదాపు 1,200 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. పటిష్ట భద్రత ఉన్న కంపౌండ్ నుంచి ఎలా చోరీ చేశారనే విషయంపై విచారణ కొనసాగుతోంది.


