← Back to news

గంజాయి తరలిస్తుండగా రోడ్ యాక్సిడెంట్

By DeeKay· 16 Jun 2026· Eenadu· విజయవాడ
గంజాయి తరలిస్తుండగా రోడ్ యాక్సిడెంట్

AP: తమిళనాడు రాష్ట్రం మధురైకి చెందిన నలుగురు యువకులు ఒడిశా-ఆంధ్రా సరిహద్దులో 25కిలోల గంజాయి కొనుగోలు చేసి కారులో రవాణా చేస్తున్నారు. నున్నకు సమీపంలోకి రాగానే గంజాయి మత్తులో విజయవాడ బైపాస్‌లో ముందు వెళుతున్న కంటైనర్‌ను ఢీకొట్టారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సాయంతో విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేరారు. నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారు గంజాయి మత్తులో ఉండడంతో పోలీసులు కారును పరిశీలించగా గంజాయి లభ్యమైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుల్లో ఒకరు పరారయ్యాడు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.