రాష్ట్రంలో వర్షాలు.. 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్!

AP: రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. శ్రీకాకుళం, మన్యం, పోలవరం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. విజయవాడ పరిసరాల్లోనూ పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో ప్రజలు అలర్ట్‌గా ఉండాలని, ఎమర్జెన్సీ ఇతే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ముఖ్యంగా వర్షం, పిడుగుల సమయంలో సేఫ్టీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరారు.



