← Back to news

స్కూటర్‌ టైర్లలో గోల్డ్‌.. ఎయిర్‌ పోర్టులో పట్టివేత!

By Mahesh· 7 Aug 2026· Delhi

దిల్లీ IGI ఎయిర్ పోర్టులో కస్టమ్స్‌ ఆఫీసర్స్ భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి ముంబయి మీదుగా దిల్లీకి వచ్చిన ఓ ప్యాసెంజర్‌ను డౌట్‌తో చెక్ చేశారు. అతడి చెక్‌డ్‌ బ్యాగేజ్‌లో ఉన్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను పరిశీలించగా టైర్లలోని సాలిడ్‌ కోర్‌లో దాచిన 24 క్యారెట్ల బంగారం బయటపడింది. మొత్తం 19 ముక్కలుగా ఉన్న 869.5 గ్రా. గోల్డ్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇల్లీగల్‌గా బంగారం తీసుకొచ్చినట్లు కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్కూటర్‌ టైర్లలో గోల్డ్‌.. ఎయిర్‌ పోర్టులో పట్టివేత!

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 7h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.