వన్యప్రాణుల సంరక్షణపై విద్యార్థులకు అవగాహన
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ అటవీ రేంజ్ పరిధిలోని కంఠబౌసుగుడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. వన్యప్రాణుల ప్రాధాన్యం, జీవవైవిధ్య పరిరక్షణ, అడవుల సంరక్షణపై అవగాహన కల్పించారు. ఎఫ్ఆర్వో బి. కోటేశ్వరరావు వివరాలు తెలిపారు. విజేతలకు ప్రోత్సాహకాలు అందజేస్తారు.



