పీజీ సెంటర్‌కు బస్సు.. NSUI డిమాండ్

గద్వాల పట్టణంలోని అగ్రహారం పాలమూరు యూనివర్సిటీ పీజీ సెంటర్‌కు ఆర్టీసీ బస్సు సర్వీసులు వెంటనే పునఃప్రారంభించాలని NSUI జిల్లా అధ్యక్షుడు కె. అవినాష్ యాదవ్ కోరారు. గద్వాల ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. గతంలో ఉన్న బస్సు సౌకర్యం రావాలని, పేద విద్యార్థుల రవాణా ఇబ్బందులు తొలగాలని, మహిళా విద్యార్థుల ఉచిత ప్రయాణం ఉపయోగపడుతుందని తెలిపారు.



