"క్రిమినల్ కుట్రలు" రాహుల్ ఫైర్
దాదాపు 300 మంది MPలు శాంతితో ప్రొటెస్ట్ చెయ్యడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ MP రాహుల్ గాంధీ. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, RSS చీఫ్ మోహన్ భగవత్, CEC జ్ఞానేష్ కుమార్‌లు క్రిమినల్ కుట్రతో దేశాన్ని హైజాక్ చేసి, రాజ్యాంగాన్ని నాశనం చేసి, ఓట్లు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ నలుగురినీ కోర్టు ముందు నిలబెడతామని అన్నారు. రాజ్‌ఘాట్ ప్రొటెస్టుకి వెళ్లే ముందు రాహుల్ ఈ కామెంట్స్ చేశారు.

