← Back to news

ప్రచారం ఇక కుదరదు!

By A.Ajay· 51m ago
ప్రచారం ఇక కుదరదు!

డాక్టర్లు, హాస్పిటళ్లు చేసే ప్రచారాలపై నేషనల్ మెడికల్ కమిషన్ కొత్త రూల్స్ తెచ్చింది. ఇక 100 శాతం నయం, నంబర్‌ వన్‌ డాక్టర్‌, నొప్పి లేని చికిత్స వంటి హామీలతో ప్రచారం చేయకూడదు. చికిత్సకు ముందు, తర్వాత ఫొటోలు, ఫేక్ రివ్యూలు, సెలబ్రిటీలతో ప్రచారం, రాయితీలు, క్యాష్‌బ్యాక్‌లు నిషేధించింది. రోగులను ఆకర్షించేందుకు తప్పుడు సమాచారం ఇవ్వకూడదని చెప్పింది. సోషల్‌ మీడియాలో డాక్టర్లు ప్రచారంలో పేరు, విద్యార్హతలు, రిజిస్ట్రేషన్‌ నంబర్‌ చూపించాలని తెలిపింది. ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

More in National