దోసెలో ఎలుక.. 25 లక్షలు డిమాండ్

ముంబైలోని బోరివలి హోటల్‌లో సెప్టెంబర్ 24న దోసెలో <a href="https://www.theclearcutnews.com/n/DTsr4Az">ఎలుక కనిపించిన వీడియో</a> వైరల్ అయ్యింది. అక్కచెల్లెళ్లు మంసి, కింజల్ వాళ్ల బంధువులతో కలిసి భోజనం చేయడానికి వెళ్లినప్పుడు దోసెలో ఎలుక ఉన్నట్లు గుర్తించారు. FDA ఆ హోటల్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆ అక్కచెల్లెళ్లు హోటల్ యజమానికి ఫోన్ చేసి, ఆ ఆహారం తిన్న తర్వాత ఆరోగ్యం పాడైందని, చికిత్స కోసం 25 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. దీనిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.
