దొంగతనానికి వచ్చాడనుకొని..యువకుడి హత్య

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సాహిబాబాద్‌లోని నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ఓ యువకుడు(17) హత్యకు గురయ్యాడు. అతను ఇనుప రాడ్లు దొంగిలించడానికి వచ్చాడని అనుమానించి సెక్యూరిటీ గార్డు అతణ్ని తుపాకీతో కాల్చాడు. అయితే అతను తన కొత్త మొబైల్‌తో రీల్ తీయడానికి వెళ్లాడని కుటుంబసభ్యులు అంటున్నారు. గార్డు వివేక్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, అతని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.



