← Back to news

కొయ్యూరు మండలంలో దెబ్బతిన్న తారు రోడ్డు

By SINDERI KAMESH· 59m ago· Koyyuru, Koyyuru, Alluri Sitharama Raju
కొయ్యూరు మండలంలో దెబ్బతిన్న తారు రోడ్డు

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బూదరళ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని పోకలపాలెం–గోదుమలంక గ్రామాల మధ్య బ్రిడ్జి సమీపంలో తారు రోడ్డు అంచు కొట్టుకుపోయింది. రహదారి పక్కన కాలువ నిర్మించకపోవడంతో వర్షపు నీరు రోడ్డుపై నుంచి ప్రవహించి అంచు దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో అధికారులు వెంటనే స్పందించి రోడ్డును పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.

కొయ్యూరు మండలంలో దెబ్బతిన్న తారు రోడ్డు
కొయ్యూరు మండలంలో దెబ్బతిన్న తారు రోడ్డు

More in Local