← Back to news

రివెంజ్ విత్ మర్డర్.. టీచర్‌ను అతి కిరాతకంగా చంపిన సైకో!

By sahani· 4 Aug 2026· haryana
రివెంజ్ విత్ మర్డర్.. టీచర్‌ను అతి కిరాతకంగా చంపిన సైకో!

హరియాణాలోని ఫరీదాబాద్‌ సరస్వతి స్కూల్లో పనిచేస్తున్న సంధ్య (29) అనే టీచర్‌ను అమిత్ (21) అనే యువకుడు అతి దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. పాఠశాల గేటు వద్ద కేవలం 30 సెకండ్లలోనే 27 సార్లు దారుణంగా దాడి చేశాడు. అడ్డుకోబోయిన పాఠశాల నిర్వాహకుడు తేజ్పాల్ ను కూడా బెదిరించి, అక్కడి నుండి బైక్‌పై పారిపోయాడు. గతంలో సంధ్య అతనిపై వేధింపుల కేసు పెట్టడంతో క్షమాపణ చెప్పిన నిందితుడు, మనసులో కక్ష పెంచుకుని ఈ హత్య చేశాడు. పోలీసులు అతడిని కేవలం రెండు గంటల్లోనే అరెస్ట్ చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 8h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.