← Back to news

పోలీసుల తీరుపై కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఫైర్

By Anand Chittari· 58m ago· Korutla, Korutla, Jagitial

TG: జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా తొలిరోజు అసెంబ్లీకి వెళ్తున్న BRS ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఎమ్మెల్యే సంజయ్ పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. అసెంబ్లీకి వెళ్తున్న ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం, దురుసుగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. ప్రజాప్రతినిధుల హక్కులను గౌరవించాలన్నారు.

More in Local