← Back to news

వేలేరులో BRS ప్రోటెస్ట్

By KanniRam· 1h ago· వేలేరు
వేలేరులో BRS ప్రోటెస్ట్

TG : అసెంబ్లీకి వెళ్తున్న BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకుని అరెస్టులు చేయడాన్ని వ్యతిరేకిస్తూ వేలేరు అంబేద్కర్ సర్కిల్ దగ్గర BRS నాయకులు రాస్తారోకో చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. ప్రశ్నించే ప్రజాప్రతినిధుల వాయిస్‌ని నొక్కేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More in Local