← Back to news

గంజాయి సేవించిన ఏడుగురు యువకుల అరెస్ట్

By Srikanth Goud· 1h ago· Peddapalli
గంజాయి సేవించిన ఏడుగురు యువకుల అరెస్ట్

TG: గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై నిఘాలో భాగంగా టాస్క్‌ఫోర్స్, పెద్దపల్లి జిల్లా ఎలిగేడ్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఎలిగేడ్ మండల కేంద్రంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఏడుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు గంజాయి సేవించినట్లు వెల్లడైందని పోలీసులు తెలిపారు. అనంతరం యువకులను గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై నిఘా కొనసాగుతుందని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.

More in Local