BCలకు 34% రిజర్వేషన్లపై కేంద్రమంత్రి క్లారిటీ!

AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక కామెంట్స్ చేశారు. రిజర్వేషన్లకు సుప్రీంకోర్టులో అవకాశం ఉందనే ఉద్దేశంతోనే కోర్టుకు వచ్చామని తెలిపారు. BC రిజర్వేషన్లను షెడ్యూల్ 9లో చేర్చే అంశంపై లీగల్ ఎక్స్‌పర్ట్స్‌తో డిస్కస్ చేసినట్లు చెప్పారు. రిజర్వేషన్లు అమలైతే BCలకు 16,800 పోస్టులు దక్కుతాయని తెలిపారు. ఇది రాజకీయ అంశం కాదని, సోషల్ జస్టిస్‌కు సంబంధించినదని క్లారిటీ ఇచ్చారు.


