← Back to news

APకి వెదర్ అలర్ట్.. 3 రోజులు వర్షాలు

By Bala· 1h ago· AP
APకి వెదర్ అలర్ట్.. 3 రోజులు వర్షాలు

AP: అమరావతి వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 3 రోజులు అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే ఛాన్స్ ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితలం కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయి. సోమ, మంగళవారాల్లో అక్కడక్కడా జల్లులు పడతాయి. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలనీ, ఉరుముల సమయంలో చెట్లు, కరెంటు స్తంభాల దగ్గరకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

More in AP