← Back to news

హమారా ప్రసాద్ పై నాన్ బెయిలబుల్ కేసుకు డిమాండ్..

By Mohan· 49m ago· Palakonda, G.Madugula, Alluri Sitharama Raju
హమారా ప్రసాద్ పై నాన్ బెయిలబుల్ కేసుకు డిమాండ్..

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనేక వక్రీకరణలకు పాల్పడుతూ "కల్పిత నాయకుడు" పుస్తకాన్ని హమార ప్రసాద్ ప్రింట్ చేయించారని, ఇతన్ని తక్షణమే నాన్ బెయిలబుల్ కేసులో అరెస్టు చేయాలని విజయనగరం జిల్లా తెర్లాం మండల దళిత నాయకుడు గండి చిరంజీవులు డిమాండ్ చేశారు. ఈ పుస్తకాన్ని వెంటనే నిలిపివేయాలన్నారు.. దళితులకే కాక భారత జాతికి హమారా ప్రసాద్ లాంటి వారు క్షమాపణ చెప్పాలన్నారు. చర్యలు తీసుకోకపోతే శాంతియుత నిరసనలు చేస్తామని మీడియాకు తెలిపారు. అంబేద్కర్ కు అవమానం సహించేది కాదన్నారు.

More in Local