మమత వర్గానికి కొత్త పేరు.. ఫుట్‌బాల్ గుర్తు

పశ్చిమ బెంగాల్‌లో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో మమతా బెనర్జీ వర్గానికి ఎలక్షన్ కమిషన్ కొత్త పార్టీ పేరు, గుర్తును అలాట్ చేసింది. మమతా నేతృత్వంలోని వర్గానికి ‘మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ పేరుతోపాటు ఫుట్‌బాల్ ప్లేయర్ గుర్తు ఇచ్చింది. మరోవైపు అరూప్ రాయ్ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గానికి ‘డెమోక్రటిక్ టీఎంసీ’ పేరు, ఎన్వలప్ గుర్తు కేటాయించినట్లు సమాచారం. TMC రెండు వర్గాలుగా విడిపోవడంతో అసలు పార్టీ పేరు, ఎన్నికల గుర్తును వాడకుండా EC ఆదేశాలు జారీ చేసింది.



