ముంబైలో ప్రముఖ కేఫ్‌కు షాక్.. లైసెన్స్ సస్పెండ్

ముంబైలోని ప్రముఖ ఒలింపియా కాఫీ హౌస్ ఫుడ్ లైసెన్స్‌ను మహారాష్ట్ర FDA సస్పెండ్ చేసింది. సెప్టెంబర్ 16న తనిఖీల్లో ఫుడ్ స్టోరేజ్ ఏరియాలో యూరినల్, బొద్దింకలు, ఈగలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఫుడ్‌ను నేలపై ఉంచడం, అపరిశుభ్రమైన నీటిని వాడటం, మాంసం రక్తం రిఫ్రిజిరేటర్‌లో కనిపించడం వంటి సమస్యలను గుర్తించారు. 35 మంది ఫుడ్ హ్యాండ్లర్లలో 34 మందికి తప్పనిసరి ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ లేదని తెలిపారు. లోపాలు సరిచేసి, రీ-ఇన్‌స్పెక్షన్ పూర్తయ్యే వరకు ఫుడ్ కొనడం, తయారు చేయడం, అమ్మడం నిలిపివేయాలని ఆదేశించారు.



