అందరికీ కార్లు ఉండవు- సుప్రీంకోర్టు ఫైర్

అక్టోబర్ 10 ప్రొటెస్ట్ కంటే ముందే ఢిల్లీలో మెట్రో స్టేషన్ల ఎంట్రీ గేట్లను పూర్తిగా క్లోజ్ చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం వల్ల గురుగ్రామ్, గ్రేటర్ నోయిడా నుండి వచ్చే స్టూడెంట్స్, ఎంప్లాయీస్, సీనియర్ సిటిజన్స్ తీవ్రంగా ఇబ్బంది పడతారని కామెంట్స్ చేసింది. "ప్రతి ఒక్కరికీ కార్లు ఉండవు.. ఇలా అన్నింటినీ నిలిపివేసి ప్రజలకు ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ లేకుండా చేయలేరు" అని CJI ప్రభుత్వాన్ని నిలదీశారు.



