← Back to news

ఆదివాసీల 'నేచురల్ ఫ్రిడ్జ్' ఆనప బూర చూసార!

By sahani· 7 Apr 2026· Telugu Report· Badrachalam
ఆదివాసీల 'నేచురల్ ఫ్రిడ్జ్' ఆనప బూర చూసార!

ఎండాకాలంలో మనం ఫ్రిడ్జ్ నీళ్లు తాగితే, భద్రాచలం మన్యం ఆదివాసీలు ప్రకృతి సిద్ధమైన 'ఆనప బూరల'తో దాహం తీర్చుకుంటున్నారు. సొరకాయలను ఎండబెట్టి, వాటిలోని గుజ్జును తొలగించి 'ఆనప బూరల'ను తయారు చేస్తున్నారు. వీటిలో నీరు ఎంతో చల్లగా ఉండటంతో ఆదివాసీలు అడవికి వెళ్లేటప్పుడు వాటర్ బాటిల్స్‌లా వాడుతున్నారు. కల్లు సేకరణకు, అంబలి తాగేందుకు కూడా వీటిని వినియోగిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

ఆదివాసీల 'నేచురల్ ఫ్రిడ్జ్' ఆనప బూర చూసార!

More in Health