← Back to news

SC, ST నిధులు పక్కదారి పట్టించొద్దు

By rajaratnam· 24 Aug 2026· ఏలూరు
SC, ST నిధులు పక్కదారి పట్టించొద్దు

AP : SC, ST సబ్‌ప్లాన్‌ నిధులు కేటాయించి, ఆ చట్టాన్ని సరిగ్గా అమలు చేయాలని దళిత హక్కుల పోరాటసమితి ఏలూరు జిల్లా ఇన్‌చార్జి ఉప్పులూరి హేమశంకర్‌ డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ఏలూరు కలెక్టరేట్‌ దగ్గర దళితులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. సబ్‌ప్లాన్‌ కింద SC, STలకు రావాల్సిన నిధులను వేరే పథకాలకు తిప్పడం ఏంటని ఆయన మండిపడ్డారు. దళితుల కోసం కేటాయించిన ప్రతీ రూపాయి వాళ్ల అభివృద్ధికే వాడాలని చెప్పారు. ఈ సమస్యను వెంటనే తీర్చకపోతే రాష్ట్రమంతటా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

More in Local