← Back to news

Breakup తర్వాత ప్రియురాలి హత్య

By Nani Eluri· 2h ago· Ndtv
Breakup తర్వాత ప్రియురాలి హత్య

కేరళలోని ఇడుక్కి జిల్లా పూపారా టీ ఎస్టేట్ దగ్గర దారుణం జరిగింది. 18 ఏళ్ల నిత్యను ఆమె మాజీ ప్రియుడు 19 ఏళ్ల నిషాంత్ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలో రిలేషన్‌లో ఉన్న వీరిద్దరూ విడిపోయారు. అక్టోబర్ 11న మాట్లాడుకుందామని నిత్యను పిలిచిన నిషాంత్.. గొడవ తర్వాత రాయితో కొట్టి చంపినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆపై మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పోలీసులు నిషాంత్‌ను అరెస్ట్ చేశారు. ప్రేమ వ్యవహారాల్లో ఇలాంటి దారుణాలు దేశవ్యాప్తంగా తరచూ వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.

More in National