అంకితా భండారీ కోసం కాంగ్రెస్ సేవాదళ్ క్యాండిల్ మార్చ్
అంకితా భండారీ హత్య కేసులో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో క్యాండిల్ మార్చ్ నిర్వహించారు. 19 ఏళ్ల అంకిత 2022 సెప్టెంబర్లో హత్యకు గురైంది. నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ హత్య వెనుక ఉన్న 'VIP' ఎవరనే కోణంపై విచారణ జరగాలనే డిమాండ్లు కొనసాగుతున్నాయి. ఇటీవల అంకితా భండారి తల్లిదండ్రులు, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తదితరులు ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు.

