← Back to news

నర్సంపేటలో MRPS నూతన కమిటీలు

By VIJAY KUMAR· 23 Aug 2026· Narsampet
నర్సంపేటలో MRPS నూతన కమిటీలు

TG : MRPS, MSP, MSF నర్సంపేట అర్బన్, రూరల్ కొత్త కమిటీలను సెప్టెంబరు 2న ఏర్పాటు చేయనున్నట్లు దళితరత్న అవార్డు గ్రహీత కళ్లపెళ్లి ప్రణయ్‌దీప్‌ తెలిపారు. ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో జరిగిన ఎమర్జెన్సీ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. గడిచిన 30 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్‌ చేసిన పోరాటాల వల్ల ఆరోగ్యశ్రీ, బియ్యం కోటా, పింఛన్ల పెంపు వంటి మంచి ఫలితాలు వచ్చాయని గుర్తుచేశారు. మాదిగల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం ప్రతీ ఒక్కరూ ఐక్యంగా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.

More in Local