← Back to news

🏫 కాలేజీ ల్యాండ్స్‌లోనే ‘యాంగ్ ఇండియా’ స్కూల్ పెట్టాలి!

By Ravi· 25 Aug 2026· Kamareddy
🏫 కాలేజీ ల్యాండ్స్‌లోనే ‘యాంగ్ ఇండియా’ స్కూల్ పెట్టాలి!

TG : కామారెడ్డి కి సాంక్షన్ అయిన ‘యాంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్’, ‘ATC సెంటర్స్’ ని జిల్లా సెంటర్‌లోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ స్థలంలోనే పెట్టాలని TNSF నేత డాక్టర్ బాలు, TJS జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. బస్సు సదుపాయం, సరైన సౌకర్యాలు లేని చోట పెడితే స్టూడెంట్స్‌కి ఇబ్బంది అవుతుందని చెప్పారు. టౌన్ సెంటర్‌లో పెడితేనే అందరికీ యూజ్‌ఫుల్‌గా ఉంటుందని, ప్రభుత్వం వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More in Local

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు
Local· 23m ago

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు

TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో ఆన్‌లైన్ సెంటర్ కోసం నిర్మించిన రేకుల షెడ్డు ధ్వంసం కావడం వివాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన ఉప్పర్ నగేష్ పాఠశాల ఎదుట ఆన్‌లైన్ సెంటర్ ఏర్పాటుకు రేకుల షెడ్డు నిర్మించారు. పంచాయతీ అనుమతులు లేవంటూ అదే గ్రామానికి చెందిన ఇబ్రహీం అభ్యంతరం వ్యక్తంచేసి కర్రతో షెడ్డు ధ్వంసం చేసినట్లు నగేష్ ఆరోపించారు. నిర్మాణానికి అనుమతి కోరుతూ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఇబ్రహీంపై చర్యలు తీసుకోవాలని బషీరాబాద్ PSలో ఫిర్యాదు చేశారు.