కాంగోలో ఎబోలా వ్యాప్తి.. వేలల్లో మరణాలు

కాంగోలో ఎబోలా వ్యాప్తి వల్ల 4,000 మందికి పైగా చనిపోయారు. ఈ వైరస్ ఇప్పటికే సోకిన ప్రాంతాలతోపాటూ.. కొత్త ప్రాంతాలకు కూడా వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ - WHO హెచ్చరించింది. కాంగోలో వైద్య సదుపాయాలు అంతంతమాత్రమే. ప్రజల్లో అవగాహన తక్కువ. అందువల్ల వ్యాధి వ్యాప్తి ఆగట్లేదు. ప్రస్తుత "బుండిబుగ్యో వైరస్" స్ట్రెయిన్‌ని ఎదుర్కొనేందుకు కచ్చితమైన వ్యాక్సిన్ లేదు. ఈ పరిస్థితిపై WHO ఆందోళన వ్యక్తం చేసింది.

