← Back to news

కథలుగా మన ముందు నిలిచిన దళిత జీవితాలు

By Vishi· 14h ago
కథలుగా మన ముందు నిలిచిన దళిత జీవితాలు

తెలుగునాట దళిత వాదం వ్యాప్తికి తన రచనల్ని దోహదం చేసినవారిలో రచయిత కొలకలూరి ఇనాక్‌ ఒకరు. ఆయన రాసిన కథలివి. సామాజిక అణచివేతకు, ఆర్థిక దోపిడీకి గురైన దళితుల జీవితాలను ఇందులో కథలుగా రాశారు. ఇందులోని ‘ఊరబావి’, ‘ఆకలి’ కథలు ఇప్పటికే జనాభిమానాన్ని పొందాయి. వాటితోపాటు ఈ సంకలనంలో ఉన్న 22 కథలు దళితుల జీవితాలలోని విభిన్న కోణాలను వ్యక్తం చేస్తాయి. ఇనాక్‌ పదునైన శైలి పాఠకుడిని కథలో లీనం అయ్యేలా చేస్తుంది. పుస్తకం ధర 150 రూపాయలు. కొనే <a href="https://www.psbh.in/product/%E0%B0%A6%E0%B0%B3%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%B2%E0%B1%81-%E0%B0%8A%E0%B0%B0%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B5%E0%B0%BF-%E0%B0%87%E0%B0%A4%E0%B0%B0/">లింక్</a>.

More in Arts/Literature

బడుగు జీవుల గురించి చెప్పే బలమైన కథలు
Arts/Literature· 1d ago

బడుగు జీవుల గురించి చెప్పే బలమైన కథలు

సదానంద్ శారదగా ప్రసిద్ధులైన పాకాల సదానంద్‍ తెలంగాణలో పేరెన్నికగన్న కథకుడు. ‘జాడీ’ కథతో ప్రజాదరణ పొందిన ఆయన దాదాపు 150 కథల వరకు రాశారు. ఆయన కథలను ‘సదానంద్ శారద కథలు’ పేరిట నవచేతన ప్రచురణ సంస్థ కథాసంపుటిగా తీసుకొచ్చింది. ఆకలి, దారిద్ర్ర్యం, వెట్టిచాకిరీ, అవమానాలు, ఆత్మహత్యలతో ముగిసిన జీవితాల గురించి లోతైన తాత్వికత ఈ కథల్లో ఉంటుంది. బడుగు జీవులు బానిస సంకెళ్లను తెంచుకొని స్వేచ్ఛగా బతకడం ఆయన కథల్లో కనిపిస్తుంది. పుస్తకం ధర 180 రూపాయలు. కొనే <a href="https://newvishalandhrabooks.com/product/sadanand-sarada-kathalu-%E0%B0%B8%E0%B0%A6%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D-%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A6-%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2%E0%B1%81/">లింక్</a>.