CECను తొలగించాలని రాజాంలో సిపిఐ నిరసన

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా రాజాంలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గాంధీ వీధిలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సీపీఐ నాయకులు కార్యకర్తలు నిరసన నిర్వహించారు. ఎన్నికల కమిషనర్ నియామక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని భాగస్వామ్యం చేయాలని అలాగే SIR ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించడం లేదని నాయకులు ఆరోపించారు


