CJPకి ఢిల్లీ హైకోర్టు ఆదేశం

ఢిల్లీ హైకోర్టు గురువారం సెప్టెంబర్ 10న కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాకి ప్రత్యేక ఆదేశం జారీ చేసింది. వారు బీజేపీ నేత, సీనియర్ అడ్వకేట్ గౌరవ్ భాటియా గురించి పెట్టిన పోస్టులు ధృవీకరణ లేనివనీ, అవి సరైనవి కావు అని కోర్టు అంది. వాటిని స్వయంగా తీసివేయాలని సూచించింది. ఇలా హైకోర్టు ఆదేశించడంతో.. ఇప్పుడు CJP నెక్ట్స్ మూవ్ ఏంటన్నది ఆసక్తిగా మారింది. ఆ పోస్టులను తొలగిస్తారా లేక.. ధృవీకరణతో పెట్టినవే అని నిరూపిస్తారా అనేది హాట్ టాపిక్ అయ్యింది.



