తెలుగు రాష్ట్రాల్లో రెండ్రోజులు వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర ఉపరితల ఆవర్తనం వల్ల వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏపీ, తెలంగాణల్లో రాబోయే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 km వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అలర్ట్‌గా ఉండాలని అధికారులు సూచించారు.



