మెడిసిన్ కవర్లపై హిందీ.. తమిళనాడులో మరో వివాదం!

తమిళనాడులోని కోయంబత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్‌లో మెడిసిన్ కవర్లపై తమిళం, ఇంగ్లిష్‌తో పాటు హిందీలోనూ డోసేజ్ వివరాలు ప్రింట్ చేయడంపై వివాదం మొదలైంది. దీనిపై DMK నేతలు విమర్శలు చేయడంతో హాస్పిటల్ అధికారులు రెస్పాండ్ అయ్యారు. ఇకపై హిందీ ఉన్న కవర్లను వాడకుండా తమిళం, ఇంగ్లిష్‌లో మాత్రమే వివరాలు ఉన్న కవర్లను వాడాలని ఆదేశించారు. ఈ కవర్లు కొత్తవి కాదని, 18 నెలలుగా వాడుతున్నామని అధికారులు తెలిపారు.



