← Back to news

టెర్రస్‌పై నుంచి దూకిన మహిళ.. అక్కడికక్కడే మృతి

By Mahesh· 25 Aug 2026· హైదరాబాద్‌
టెర్రస్‌పై నుంచి దూకిన మహిళ.. అక్కడికక్కడే మృతి

TG: హైదరాబాద్‌ KPHBలో దారుణ ఘటన జరిగింది. పంచవటి అపార్ట్‌మెంట్స్‌లో శీతల్‌ (32) అనే మహిళ మృతి చెందారు. నిన్న సా. 4 గం. సమయంలో టెర్రస్‌పైకి వెళ్లి ఐదో ఫ్లోర్ నుంచి కిందకు దూకినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. శీతల్‌ కొంతకాలంగా డిప్రెషన్‌కు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్లు ఆమె భర్త పోలీసులకు తెలిపారు. వీరు కేరళంలోని కన్నూర్ ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై KPHB పోలీసులు కేసు బుక్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 4h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.