కొడుకు కోసం కూతుర్ని నరబలి!

ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో కొడుకు అనారోగ్యం నయం కావాలని ఓ తల్లి కన్నకూతుర్నే నరబలి ఇచ్చింది. రేఖీదేవి అనే మహిళ, తన కొడుకు ఆరోగ్యం కోసం మంత్రగత్తె శాంతీదేవి మాటలు నమ్మి. తన ప్రియుడు భీమ్‌రామ్‌తో కలిసి 13 ఏళ్ల కుమార్తెను తాంత్రిక పూజల పేరుతో హత్యచేసింది. ఆమె రక్తంతో పూజలు చేశారు. మర్నాడు బాలిక మృతదేహాన్ని అనుమానాస్పద స్థితిలో గుర్తించిన పోలీసులు విచారించి. మూఢనమ్మకంతో హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసారు.



