← Back to news

బస్సు భవన్ ముందు వికలాంగుల ధర్నా

By Sharmila· 1h ago

TG:హైదరాబాద్‌లోని బస్సు భవన్‌ ముందు వికలాంగులు ధర్నా చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు RTC బస్సుల్లో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. హామీని వెంటనే అమలు చేయాలని కోరుతూ నిరసన తెలిపారు. ప్రొటెస్ట్‌కు వచ్చిన వికలాంగులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది.

More in TG