← Back to news

బీచ్‌కు వెళ్లిన విద్యార్థుల్లో ఇద్దరు మృతి

By Lokesh· 1h ago
బీచ్‌కు వెళ్లిన విద్యార్థుల్లో ఇద్దరు మృతి

శ్రీకాకుళం జిల్లాలోని గణగళ్లవానిపేట బీచ్‌లో మంగళవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన ఓ కోచింగ్ సెంటర్‌కు చెందిన నలుగురు విద్యార్థులు అలల ఉద్ధృతికి కొట్టుకుపోయారు. వీరిలో పావని, మాధవి అనే ఇద్దరు మృతి చెందారు. వీరు విజయనగరం జిల్లా రామభద్రపురానికి చెందినవారని తెలిసింది. మిగిలిన ఇద్దరి కోసం సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

More in AP