మద్యం మత్తులో నడిరోడ్డుపై ఫైట్
విజయవాడలోని యనమలకుదురు స్క్రూ బ్రిడ్జి సెంటర్ వద్ద మద్యం మత్తులో కొందరు నడిరోడ్డుపై గొడవకు దిగారు. ఒకరినొకరు దుర్భాషలాడుకుంటూ, కర్రలతో దాడి చేసుకున్నారు. వాహనాల రాకపోకలు సాగుతున్న లెక్క చేయలేదు. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు వారిని విడదీసేందుకు ప్రయత్నించారు. ఈ గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

