రూ.15 కోట్ల దేవాలయ భూమి కబ్జా

AP: మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలోని శివాలయం వద్దనున్న బ్రహ్మంగారి గుడి స్థలాన్ని కొందరు ఆక్రమించారని పొదిలికి చెందిన ఆకుపాటి లక్ష్మణ అనే భక్తుడు ఆరోపించారు. ఆలయ స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆయన ఫిర్యాదు చేశాడు. స్దానిక అధికారులకు పలుసార్లు ఫిర్యాదులు చేసినా ఎవ్వరు పట్టించుకోలేదని ఆయన ఆరొపించాడు. దాదాపు రూ.15 కోట్ల విలువైన ఆస్తిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టి కోట్ల విలువైన స్దలాన్ని భూకబ్జదారుల నుంచి కాపాడాలని ఆయన కోరారు.



