← Back to news

H-1Bపై లక్ష డాలర్ల ఫీజు.. మళ్లీ షాకిచ్చిన ట్రంప్‌

By Anusha· 19 Sept 2026
H-1Bపై లక్ష డాలర్ల ఫీజు.. మళ్లీ షాకిచ్చిన ట్రంప్‌

H-1B వీసాపై విధించిన లక్ష డాలర్ల ఫీజును అమెరికా ప్రభుత్వం మరో 12 నెలలు పొడిగించింది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దీనికి సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేశారు. అమెరికా బయట నుంచి కొత్తగా H-1B వీసాతో వచ్చే వారికి ఈ ఫీజు వర్తిస్తుంది. ఇప్పటికే అమెరికాలో ఉన్న విద్యార్థులు.. H-1Bకి మారడానికీ, వీసా స్టేటస్‌ మార్చుకునే దరఖాస్తులకూ మినహాయింపు ఉంది. ఈ ఫీజును 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్‌ కోర్టులో సవాలు చేయగా, న్యాయపరమైన వివాదం కొనసాగుతోంది. H-1B లబ్ధిదారుల్లో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

More in International