నోయిడాలో మైనర్ అక్రమ అరెస్ట్ పై NHRC సీరియస్..

నోయిడా కార్మికుల నిరసనల కేసులో 16 ఏళ్ల మైనర్ బాలుడిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి, పెద్దల జైలులో ఉంచడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది. 'ది వైర్' కథనం ప్రకారం.. నిరసనలతో ఎలాంటి సంబంధం లేకపోయినా, మైనర్ అని తెలిసినా ఆ బాలుడిని దాదాపు రెండు నెలల పాటు జైలులో ఉంచారు. దీనిపై ది వైర్ నివేదికను సుమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ, యుపి ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ సమగ్ర నివేదికను కోరింది.



