గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో హిల్ రిడ్జ్ విల్లాలో ఉంటున్న ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో కేజీ బంగారు ఆభరణాల చోరీ జరిగింది. ఇంట్లో పనిచేసే నేపాల్‌కు చెందిన భార్యాభర్తలే ఆభరణాలతో పరారయ్యారు. కొద్దిరోజుల క్రితం యజమాని కుటుంబం ముంబాయి వెళ్లి తిరిగి వచ్చేసరికి నేపాలీ దంపతులు కనిపించలేదు. ఇంట్లో తాళాలు పగలగొట్టినట్లు ఎలాంటి గుర్తులు లేకపోవడంతో తమకు చెప్పకుండా వెళ్లిపోయారని భావించారు. పూజ గదిలోని విగ్రహానికి ఉన్న బంగారు గొలుసు కనిపించకపోవడం, మరికొన్ని బంగారు ఆభరణాలు కూడా మాయం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.



