← Back to news

వర్నిలో ఉచిత మెడికల్ క్యాంప్

By DK· 1h ago
వర్నిలో ఉచిత మెడికల్ క్యాంప్

నిజామాబాద్ జిల్లా వర్నిలో బోధన్, వర్ని లయన్స్ క్లబ్‌ల ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. వర్నిలోని రామాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో ప్రజలకు షుగర్, BP పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. పేదలకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వర్ని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నూనె శ్రీనివాస్, సర్పంచ్ కనకదుర్గ రవి, తదితరులు పాల్గొన్నారు.

More in Local