← Back to news

స్తంభాన్ని ఢీకొట్టి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

By malluru chandrashekar· 1h ago· Kandukuru, Vemsoor, Khammam
స్తంభాన్ని ఢీకొట్టి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కందుకూరు నుంచి వెంకటాపురం గ్రామాల మధ్య రహదారిపై వెళ్తున్న కారు అదుపుతప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం పక్కనే ఉన్న వరి పొలాల్లోకి దూసుకెళ్లడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో కందుకూరుకు చెందిన మందపాటి రామ్మోహన్ రెడ్డి కుమారుడు సంతోష్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో కందుకూరు గ్రామంలో విషాదం నెలకొంది.

స్తంభాన్ని ఢీకొట్టి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
స్తంభాన్ని ఢీకొట్టి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

More in Local